ప్రారంభమైన నాగార్జున సాగర్ ఉపఎన్నిక కౌంటింగ్

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు కీలకమైన నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 25 రౌండ్లలో లెక్కింపు చేపట్టనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కౌంటింగ్ కొనసాగనుంది. మొత్తం 400 మంది కౌంటింగ్‌ సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొననున్నారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉప ఎన్నికలో ప్రధాన రాజకీయ పక్షాలు టీఆర్‌ఎస్‌ నుంచి నోముల భగత్, కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ నుంచి రవికుమార్‌ పోటీ చేశారు.