నక్కపల్లి మండలం జనసేన పార్టీలో చేరికలు

పాయరావుకపేట, అధికార పార్టీ అయిన వైఎస్సార్సీపీ గురువారం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతీ సామాన్యుడిని చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది తప్పు అని ప్రశ్నిస్తే రౌడీయిజం చేస్తున్నారు, ఇలాంటి అవమానకర పరిస్థితులు తట్టుకోలేక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి అన్యాయాన్ని ఎదిరించాలన్న దృఢ సంకల్పంతో 25 సంవత్సరాల అపార రాజకీయ అనుభవం కలిగిన నక్కపల్లి మండలం, దొండవాక గ్రామస్థులు కోడా సత్తిబాబు జనసేన పార్టీలోకి రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నక్కపల్లి మండలం జనసేన పార్టీ నాయకులు గోవిందు, వరహాలబాబు, అప్పలరాజు, గణేష్, శివాజీ, మహేష్, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.