పలు వ్యాపార ప్రారంభోత్సవాలలో పంతం నానాజీ

కాకినాడ రూరల్, జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇన్ ఛార్జ్ పంతం నానాజీ కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామ అధ్యక్షులు శివతేజ బంధువు తారక రామ నగర్ ప్రాంతంలో షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం అన్నమ్మ ఘాటీ సెంటర్ లో విజయదశమి సందర్బంగా స్వీట్స్ &బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. తదుపరి, కాకినాడ రూరల్ జనసైనికులు ప్రసాద్ ఫోటో స్టూడియోని రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.