నాని ‘శ్యామ్ సింగరాయ్’ నవంబర్ నుంచి సెట్స్ పైకి

నేచురల్ స్టార్ నాని మళ్లీ స్పీడు పెంచారు. నాని ఇటీవల ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసందే. ఇంద్రగంటి మోహన్ కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. దిల్ రాజు మేకింగ్ ఈ చిత్రాన్ని ఆ లెవల్లో నిలబెట్టలేకపోయాయి. దీంతో ఈ మూవీ డిజిటల్ నిరాదరణతో దారుణ ఫలితాన్ని చూడాల్సి వచ్చింది.  ఈ సినిమా తర్వాత నాని వరుసగా సినిమాలు లైన్ లో పెట్టాడు. వాటిలో ‘శ్యామ్ సింగరాయ్’ ఒకటి. `ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా పిరియాడికల్ కథతో తెరకెక్కుతోందని తెలుస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాని క్యారెక్టర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్. నవంబర్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి రాబోతోందని తెలిసింది. కొంత భాగం పురాతన కోట నేపథ్యంలో సినిమా సాగుతుందట. మూవీ నేపథ్యంలో.. నాని క్యారెక్టర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్స్ గా నిలుస్తాయని ఇన్ సైడ్ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తివివరాలు చిత్ర మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారట.