ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సరికొత్త రికార్డు.. టైటిల్ గెలుచుకున్న నవోమి ఒసాకా..

ఆస్ట్రేలియన్​ ఓపెన్ ఛాంపియన్​గా జపాన్​ టెన్నిస్​ స్టార్​ నవోమి ఒసాకా నిలిచింది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ టైటిల్‌ను కైవసం చేసుకుని సరికొత్త చరిత్రను సృష్టించింది. శనివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళ సింగిల్స్ ఫైనల్లో ఆమె చాంపియన్‌గా నిలిచింది. దీంతో నవోమి ఖాతాలో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు వచ్చి చేరాయి.

శనివారం జరిగిన ఫైనల్స్‌లో అమెరికాకు చెందిన జెన్నిఫర్‌ బ్రాడీ ని 6-4, 6-3 తేడాతో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తుదిపోరులో ఫేవరేట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఒసాకా ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. వరుస సెట్లలో బ్రాడీని చిత్తు చేసింది.

ఈ టైటిల్ ఒసాకాకు మొత్తంగా నాలుగోది కాగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రెండోది. కాగా ఆడిన తొలి నాలుగు గ్రాండ్‌స్లామ్‌లనూ సొంతం చేసుకున్న మహిళా టెన్నిస్ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. 1990-91లలో ఇంగ్లండ్‌కు చెందిన మోనికా సెలెస్ ఈ ఫీట్‌ సాధించారు. ఆ తరువాత మరెవ్వరూ ఈ ఘనత దక్కించుకోలేకపోయారు. ఇన్నాళ్లకు ఒసాకా మళ్లీ అదే రికార్డు నెలకొల్పింది.