బెంతు ఒరియాల దీక్షకు నటరాజ్ శాక్య సంఘీభావం

ఇచ్చాపురం: కవిటి మండల కేంద్రంలో బెంతు ఒరియా గిరిజనులు కొనసాగిస్తున్న 35వ రోజు దీక్షలో పార్ల పడ్డ గ్రామస్తులు యువత పెద్దలు పాల్గొన్నారు. బెంతో ఒరియా గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రముఖ ఆంధ్ర యునివర్సిటీ పరిశీలకుడు రిటైర్డ్ ప్రొఫెసర్ గౌరవ నటరాజ్ శాక్య వారు పలు గ్రామాలు స్వయంగా తిరిగి సామాజిక సంస్కృతి, స్థితి గతులపై ఆరా తీసి వాస్తవాలను తెలుసుకొని ఆచార్య స్తితులైయ్యారు. అనంతరం దీక్ష శిబిరానికి చేరుకొని నటరాజ్ శాక్య వారు సంఘిబావం తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బెంతో ఒరియా ప్రజలు ఇచ్ఛాపురం నియోజక వర్గంలో 25వేల జనాభా గల వీరి జీవన స్థితగతులు ఆర్థికంగా వెనుకబడిన వారని తాతలకు, తండ్రులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇచ్చి ఇప్పుడు పిల్లలకు ఇవ్వకపోవడం ఆచర్యం అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును 2003 తరువాత నిలుపుదల యే కారణం చేత నిలుపుదల చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వీరి వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని తెలిపారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉందని, రేవెన్యోడిపార్ట్మేంట్ జారీ చేసిన జీఓ లు ఎన్నో ఉన్న వీరి హక్కులను కాలరాయడం అన్యాయం అని ఏటువంటి ప్రభుత్వ జీఓలు జారీ లేకుండా రెవెన్యూ అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు నిలుపుదల చేయడం రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం సరికాదని వ్యక్తం చేశారు. ఆదివాసీ వాబాయోగి అసత్య ఆరోపణలు విసపు ఉద్యమ ఆలోచనలు మానుకోవాలని సూచించారు. వీరికి అన్నీ వర్గాలు మద్దతు ఇస్తున్నరని నిజమైన బెంతో ఒరియ గిరిజనులకు అన్యాయం జరగడం పట్ల న్యాయం చేయాలని నటరాజ్ శాక్య కోరారు. అనంతరం వేదవరా బిసాయి మాట్లాడుతూ బహుజన సమాజ్ పార్టీ మద్దతు ఉందని న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు మా ఉద్యమం ఉద్రిక్తం చేస్తామని ప్రణత్యగనికి అయిన వెనకాడ బోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాకర్ల కామేష్ ఎక్స్ ఎం పీ టీ సి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బృందావన్ సాహు, రామారావు మజ్జి, సంతోష్ సర్పంచ్ జయసేన్ బిసాయి, సెంకర్, ప్రేమ్, కృష్ణ దలై, దుదిస్టి మజ్జి, బృందావన్ బిసాయి తదితరులు పాల్గొన్నారు.