ఉత్తమ ఎఫ్ఎంసిజి కేటగిరీ లో విన్ ఫినిత్ కి జాతీయ అవార్డు

ఉత్తమ ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్ విభాగంలో విన్ ఫినిత్ మార్కెటింగ్ కంపెనీ జాతీయ అవార్డ్ కు ఎంపిక అయినట్టు నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ చైర్మన్ నాగేశవరరావు, సంస్థ దక్షిణ భారతదేశ బాద్యులు పేరూరు బాలకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. మార్చ్ నెల 15 న దేశ రాజధాని ఢిల్లీలో జరిగే ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ అవార్డ్ ను విన్ ఫినిత్ సంస్థ ప్రతినిధులకు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ఎఫ్ఎంసిజి కేటగిరీ లో పలు కంపెనీలు పోటీ పడగా ఎక్కువ ఆదరణ పొందిన ఉత్పత్తులను అందిస్తున్న కంపెనీగా విన్ ఫినిత్ నిలిచిందని జూరి సభ్యులు నిర్ణయించారు. దీంతో జాతీయ అవార్డు కోసం ఎంపిక కబడినట్లు తెలిపారు. 2020 లో స్థాపించిన ఈ కంపెనీ కరోనా లాంటి ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని నిలబడటానికి ఆ కంపెనీ స్థాపకులు చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డ్ నిలుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ చైర్మన్ మహేష్ డేగలని నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమీషన్ ఆంధ్రప్రదేశ్ కు అడ్వైజరి బోర్డ్ చైర్మన్ గా నియమించడం జరిగింది.