మార్కాపురం జనసేన ఆధ్వర్యంలో జాతీయ రైతు దినోత్సవ వేడుకలు

మార్కాపురం: జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు మరియు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ సూచనల మేరకు మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి మండలాల్లో రైతులతో మమేకమై గ్రామాల్లోని పంట పొలాలను సందర్శించిన జనసేన మార్కాపురం నియోజకవర్గ కార్యవర్గం. అలాగే రైతన్నలు వారి యొక్క పంట నష్టాలను వ్యక్తపరిచారు. లక్షలాది ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చే కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసా కలిపించి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు అందజేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు. వారు రైతు కుటుంబాల కోసం పరితపిస్న్నస్తున్న ప్రణాళికలను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్ షాధిక్, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, పేరూరి రమేష్, సోను, చాతరాసి సుబ్బారావు, పగడాల కాశి రావు, గంగుల శివ, పగడాల వెంకటేష్, పగడాల శ్రీను మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.