ఆడపూరులో ఎన్డీఏ కూటమి ప్రచారం

రాజంపేట: జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు గురువారం, ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలం ఆడపూరు గ్రామ పంచాయతీలో జనసేన, బిజెపి, టిడిపి కూటమి ప్రచారంలో రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం పాల్గొనగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంటు సమన్వయకర్త యల్లటూరు శ్రీనివాస రాజు సూచన మేరకు ప్రచారం నిర్వహించి ఓటర్లకు మేనిఫెస్టోను నాయకులు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మరియు సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాజంపేట అసెంబ్లీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఇప్పుడు ఉన్న ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టిసి చైర్మెన్ యెద్దల సుబ్బరాయుడు, మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్,మాజీ అగ్రికల్చరల్ మార్కెట్ చైర్మెన్ యెద్దల సాగర్,జంగంశెట్టి సుబ్రమణ్యం, డాక్టర్ అరిగెల రామ్ ప్రసాద్, లక్ష్మీ నరసయ్య, పాలగిరి మల్లికార్జున రెడ్డి, సుగువాసి మహేష్, మాజీ వక్ఫ్ బోర్డు ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్, ఆకుల చలపతి, సమ్మెట ఉమా మహేష్, లేబాక నరసయ్య, రమేష్ బాబు, యచంద్ర నాయుడు, కరీమ్, వెంకట్రామిరెడ్డి, నగేష్ నాయుడు, చెంగయ్య నాయుడు, సుబ్రమణ్యం నాయుడు, ప్రశాంత్ భారతాల, తిప్పాయిపల్లి ప్రశాంత్, కొండిశెట్టి సుదర్శన్, సుబ్బు, సోము, మౌలా, మహేష్, సాయి, రాచూరి మురళి తదితరులు పాల్గొన్నారు.