ఉపాధి హామీ పథకం పై జనసేన డిమాండ్లు

అయినవిల్లి మండలం పోతుకూరు పంచాయతీ పరిధిలో కేంద్రం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం ఎండలు అధికంగా ఉన్న కారణంగా స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు గుర్రాల రాంబాబు రమాదేవి ఉపాధి కూలీలకు శీతల పానీయాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వానికి స్థానిక ఎంపీటీసీ సభ్యులు కొన్ని డిమాండ్లు ఇవ్వడం జరిగింది.

  1. మొదటిగా రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా ఉపాధి కూలీలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు కాబట్టి వెంటనే ఉపాధి పని హాఫ్ డే లు ప్రకటించాలి
  2. రాష్ట్రంలో నిత్యవసర వస్తువులు పెరిగిన కారణంగా ఉపాధి కూలీలకు రోజు వారి వేతనాలు పెంచాలి
  3. సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కనిపించాలి
  4. జాబ్ కార్డు లేని వారికి తక్షణమే జాబ్ కార్డులు ఇచ్చి వారికి కూడా ఉపాధి కల్పించాలి.
    పై డిమాండ్ వెంటనే ప్రభుత్వం వారి పనుల్లో తీసుకుని తక్షణం పరిష్కరించాలని అని పోతుకూరు కొండుకుదురు ఎంపిటిసి ఎంపీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున వారందరికీ శీతల పానీయాలు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.