కేశవదాసుపాలెంలో ఎన్.డి.ఏ కూటమి ఇంటింటి ప్రచారం

రాజోలు: కేశవదాసుపాలెం గ్రామంలో 7వ రోజు ప్రచారంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీలు బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీదేవ వరప్రసాద్ మరియు అమలాపురం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి శ్రీ గంటి హరీష్ మాధుర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన, టీడిపి, బీజేపీ గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు ఇంటి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలు, బిసి డిక్లరేషన్ గురించి, ఎస్సీ ఎస్టీ సోదరులకు 19% ఉన్న రిజర్వేషన్ 12% అమలు చేస్తూ, 27 పథకాలు తోలగించిన మోసలను, కొత్త జీఓ ద్వార భూమి హక్కు మనకు లేకుండా చేసినా జగన్ రెడ్డి దిగిపోవాలి అని తెలియజేస్తూ ప్రజా సమస్యలు త్రాగు నీరు, డ్రైనేజ్, కరెంటు రోడ్లు, కాలువలు పూడిక తీత, తదితర సమస్యలు తెలుసుకుని. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సమస్యలు తప్పనిసరిగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఉమ్మడి మేనుపెస్టూ వివరించి మన భవిష్యత్ బాగుండాలి అంటే ఎమ్మెల్యే అభ్యర్దికి గాజు గ్లాసు, ఎంపీ అభ్యర్ధికి సైకిల్ గుర్తుపై తమ అమూల్య మైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరాము ఈ ప్రచారంలో గ్రామంలోని జనసేన, టీడీపి బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.