జనసేన బలోపేతానికి దిశానిర్దేశం చేసిన నేమూరి శంకర్ గౌడ్

హైదరాబాద్, తెలంగాణలోని 32 నియోజకవర్గాల కార్యనిర్వాహకులతో జూబ్లీహిల్స్ లోని జనసేన పార్టీ సెంట్రల్ ఆఫీసులో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ సమావేశం ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ కమిటీ సభ్యులు రాజలింగం, దామోదర్ రెడ్డి, నియోజకవర్గాల కార్యనిర్వాహకులు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.