వారాహి యాత్ర విజయవంతం కావాలని కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు

విజయవాడ వెస్ట్: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన మూడవ విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుతూ 40వ డివిజన్ జనసేన పార్టీ యాక్టివ్ మెంబర్షిప్ కోఆర్డినేటర్ ఎం. హనుమాన్ ఆధ్వర్యంలో ఘాట్ రోడ్ లోని కామధేను అమ్మవారికి పూజలు నిర్వహించి అనంతరం అమ్మవారికి 108 కొబ్బరికాయలు కొట్టిన అనంతరం, ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి హుస్సేనిషా ఖాధరి దర్గాకి పాదయాత్రగా వెళ్లి డివిజన్ అధ్యక్షులు తమ్మిన. లీలా కరుణాకర్, ఏలూరు. సాయిశరత్ మరియు సింగెనం శెట్టి రాము గుప్తాలతో చాదర్ సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం. హనుమాన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవ్వాలని అమ్మవారిని కోరుతూ జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి మరియు నగర అధ్యక్షులు పోతిన మహేష్ ఆదేశాల మేరకు అమ్మవారికి పూజల నిర్వహించి 108 కొబ్బరికాయలు కొట్టడం జరిగిందని అనంతరం పాదయాత్ర చేసి దర్గాలో చాదర్ సమర్పించామని, ఎస్.కె గయాజుద్దీన్ అతనికి కనీసం జనసేన సభ్యత్వం కూడా లేదని అటువంటి వ్యక్తి జనసేన పార్టీ పేరు చెప్పుకుంటూ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తాడని, అతను వెల్లంపల్లి శ్రీనివాసరావు గారితో కలిసి చేస్తున్న అక్రమాలు మాకు తెలుసని త్వరలోనే పార్టీ అధిష్టానంకు ఫిర్యాదు చేస్తామని తప్పక అతనిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు తమ్మిన రఘు బాబు, రాళ్లపూడి గోవింద్ అడ్డగిరి. పుల్లారావు, నగర కార్యదర్శి బొట్టా. సాయికుమార్, చిరంజీవి యువత విజయవాడ సిటీ వైడ్ ప్రెసిడెంట్ పులిచేరి. రమేష్ జనసేన యువ నాయకులు ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్.కె పండు, తవ్వా మారుతి, ధారా రాము, నాగార్జున దుర్గారావు, నాగచైతన్య, అశోక్, అక్షయ్, నాగేంద్రబాబు, దాసిన్ జగదీష్ పవన్ కళ్యాణ్ ప్రశాంత్, నాగరాజు, సాంబ సూరిబాబు, బండి రామకృష్ణ, సోమి మహేష్ తదితరులు పాల్గొన్నారు.