గాంధీ మహాత్మునికి నివాళులర్పించిన నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ, కేపీహెచ్బి: గాంధీ జయంతి సందర్భంగా సోమవారం కూకట్పల్లి నియోజకవర్గంలోని కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ -1లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్లు కొల్లా శంకర్, వేముల మహేష్, వెంకటేశ్వరరావు, గడ్డం నాగరాజు కిషోర్, డివిజన్ ప్రెసిడెంట్లు కలిగినేడి ప్రసాద్, జన్నే సునీల్, సుంకర సత్య సాయి, జీవి కృష్ణారావు, పోతుల నరేష్, వీరు ప్రసాద్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.