భక్తుల కన్నా వైసిపి నాయకులు ఎక్కువా?: ఎం హనుమాన్

విజయవాడ వెస్ట్: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తే వైసిపి నాయకులు ఎందుకంత చులకన భావన అని జనసేన పార్టీ చేనేత రాష్ట్ర కార్యదర్శి 40డివిజన్ కోఆర్డినేటర్ న్యాయవాది ఎం హనుమాన్ పేర్కొన్నారు. ఎం హనుమాన్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దుర్గమ్మ గుడి అంటే మీ అడ్డా కాదు పవిత్ర దేవస్థానంలో మీ రౌడీయిజం ఏంటి?. భక్తులు కన్నా వైసిపి నాయకులు ఎక్కువా? అమ్మవారి దర్శనానికి అందరూ సమానులే. దుర్గమ్మ గుడి చైర్మన్ వస్తున్నాడని భక్తులను ఇబ్బంది పెడుతున్న గుడి సిబ్బంది. చైర్మన్ ఎవరు ?? చైర్మన్ కి క్రిమినల్ కేసులు ఉన్న అర్హత ఉందని పవిత్ర దేవస్థానంలో చైర్మన్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ కళ్ళు మూసుకుపోయాయా? మీ అరాచకాలని ఇంకా 5 నెలలు మాత్రమే.. పశ్చిమ నియోజకవర్గం రాబోయే మ జనసేన ప్రభుత్వంలో అమ్మవారికి కొత్త వైభవాన్ని తీసుకొచ్చే బాధ్యతను తీసుకుంటాం అమ్మవారి గుడిలో లడ్డూ దగ్గర్నుంచి భక్తుల అసౌకర్యాలు ఎక్కడ కలగకుండా. ఎక్కడా ఆవనీతి లేకుండా ప్రతి ఒక్క రూపాయి అమ్మవారి దగ్గర ఖర్చుపెట్టి నిజమైన అమ్మవారి సేవ మేము చేసి చూపిస్తాము కూడా ఈ వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ఒళ్ళు దగ్గర పెట్టుకుని అమ్మవారి సేవకు వచ్చే భక్తుల్ని మర్యాదపూర్వకంగా చూడాలని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం తరఫున హెచ్చరిస్తున్నాం. రాబోతున్న దసరా ఉత్సవాలకి భక్తులకి అసౌకర్యం కలిగినా, మీ వైసీపీ నాయకులు రౌడీయిజం చేసినా ఇంద్రకీలాద్రి అమ్మవారి సాక్షిగా మీ అవినీతిని బయటపెట్టి జైలుకు పంపించే బాధ్యతను నేను తీసుకుంటానని హనుమాన్ హెచ్చరించారు.