రాక్షస పాలనపై సమరానికి సమాయత్తం కావాలి: నేరేళ్ళ సురేష్

గుంటూరు: రాష్ట్ర ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న రాక్షస పాలనపై ప్రజల పక్షాన సమరానికి సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన పార్టీ గుంటూరు అర్బన్ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన క్రియాశీలక సభ్యుత్వ నమోదు అవగాహనా సదస్సుకి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి నగర కార్యదర్శి పాములూరి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. నేరేళ్ళ సురేష్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గత సంవత్సరం చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కన్నా ఈ సంవత్సరం అత్యధికంగా చేయాలని నాయకులను కోరారు. ప్రస్తుతం జనసేనకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ లభిస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం పట్ల, ఆయన నిజాయితీ నిబద్ధత పట్ల ప్రజల్లో నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రధానంగా వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులకు, ముస్లిం మైనారిటీలకు జగన్ రెడ్డి చేసిన ద్రోహం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదని దుయ్యబట్టారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు పవన్ కళ్యాణ్ ఒక ఆశాదీపంలా కనిపిస్తున్నారని, వారంతా జనసేన వెంట నడిచేందుకు సిధ్ధంగా ఉండారన్నారు. మరో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే గుంటూరు నగరం ప్రధమ స్థాయిలో నిలిచేలా ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు. జనసేన పార్టీలో చేరేందుకు అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, యువకులు, తటస్థులు ఎంతో ఆసక్తితో ఉన్నారన్నారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, దీనిద్వారా ఐదు లక్షల ప్రమాద భీమా చేయబడుతుందన్నారు. ఈ నెల పది నుంచి మొదలయ్యే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నేరేళ్ళ సురేష్ ఆధ్వర్యంలో విజయవంతం చేయటానికి ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శిలు కొండూరి కిషోర్ కుమార్, యడ్ల నాగమల్లేశ్వరరావు, ప్రధాన కార్యదర్సులు ఆనంద్ సాగర్, సూరిశెట్టి ఉదయ్ నగర కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.