బుడంపాడులో జగనన్న కాలనీలను సందర్శించిన నేరేళ్ళ

గుంటూరు: పట్టణంలోని 16వ డివిజన్, బుడంపాడు లోగల జగనన్న కాలనిలోని ఇళ్ళను రాష్ట్ర జనసేన అధ్యక్షులు కోణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శనివారం గుంటూరు పట్టణ అధ్యక్షులు నేరేళ్ళ సురేష్ ఆధ్వర్యంలో పరిశీలించటం జరిగినది. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ.. గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో పేదలకు ఉచితంగా ఇళ్ళను ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి నేటికి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలేకపోవడం బాధాకరం అని అన్నారు. ప్రస్తుతం ఈ కాలనీలో ప్రజలు నివసించటానికి సరిఅయిన రోడ్లు, మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నిర్మాణాలు కూడా చేపట్టలేక పోయినారు. నేడు రాష్ట్రంలో ఏక్కడ చూసినా జగనన్న కాలనీల దుస్థితి కనీసం ప్రాధమిక వసతులు కూడా కల్పించలేక పోవడం శోచనీయం అని సురేష్ అన్నారు. జగనన్న కాలనీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయాయని, ప్రతి నిత్యం ఈ కాలనీలో ప్రజలు నివసించక పోయినా కాని వీధిలైట్లు ఎప్పుడూ వెలిగి వుండటం వలన ఆ కరెంట్ బిల్లులు వాటాన్నింటిని మనం అందరం భరించటం జరుగుతుందని నేరేళ్ళ సురేష్ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మి దుర్గ, 47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి యర్రంశెట్టి పద్మావతి, జిల్లా కార్యదర్శి మేకల రామయ్య, పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు, కొండూరు కిషోర్, కటకంశెట్టి విజయలక్ష్మి, పట్టణ ప్రధాన కార్యదర్శి సూరిశెట్టీ ఉదయ్, బుడంపాడు సొసైటి మాజీ అధ్యక్షుడు ఆకుల వీరరాఘవయ్య, పట్టణ మీడియా కోఆర్డినేటర్ పుల్లంశెట్టి ఉదయ్, నగర కార్యదర్శులు బండారు రవీంద్ర, తోట కార్తీక్, పావులూరి కోటేశ్వరరావు, డివిజన్ అధ్యక్షులు విష్ణుమెలకల ఆంజినేయలు, జడ సురేష్, వీరమహిళలు శ్రీమతి పాకనాటి రమాదేవి, జంజనం మల్లేశ్వరి, శనక్కాయల అనసూయ, సాంబ్రాజ్యం, రమ, ఆరుణ, ఆసియా, జనసైనికులు మన్నె స్వాములు, దాసరి వాసు, మాదాసు మాధవ, పులిగడ్డ గోపి, మహంకాళి శ్రీనివాసరావు, తిరుమలశెట్టి కిట్టు, సోమిశెట్టి నవీన్, చిరంజీవి, లెనిన్, కుర్రా రవి, సింగ్, ఆకుల సతీష్, దాది ఆంజి, అములోతు నాగరాజు, కవలాశ్రీను, చలమయ్య ఏడుకొండలు, బడే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.