ఇంత చేతగాని ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు: అతికారి దినేష్

  • సొంత జిల్లా ప్రజలను ఆదుకోలేని ఈ అసమర్ధ ప్రభుత్వం ఎందుకు? మీడియాతో అతికారి దినేష్

అన్నమయ్య జిల్లా, రాజంపేట, భారీ వరదల కారణంగా అన్నమయ్య డ్యాం నీటి ప్రవాహానికి తట్టుకోలేక డ్యామ్ తెగి వచ్చినటువంటి వరదల కారణంగా నష్టపోయిన బాధితులను 18 నెలలు గడిచిన ఆదుకోలేనటువంటి ఇంతటి చేతకాని ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని సొంత జిల్లా ప్రజలకు చేయూత ఇవ్వలేని ఇటువంటి అసమర్థ ముఖ్యమంత్రిని చెతకాని ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామని రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ రాజంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో తెలిపారు. 36 మంది చనిపోయినా ఈ ప్రభుత్వానికి చలనం లేదని నాలుగు గ్రామాల ప్రజలు సర్వం కోల్పోయిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులతో మాట్లాడుతున్న సమయంలో వారికున్న ఆవేదన వారికున్న బాధను చూస్తూ ఉంటే కేవలం ప్రజలను ఓటర్లగా చూసే ఇటువంటి ప్రభుత్వ నాయకులకు ప్రజా సమస్యలు పట్టవా అని ప్రశ్నిస్తున్నాం. వరదల సమయంలో అధికార పార్టీ నాయకులు జిల్లా అధికార యంత్రాంగం ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోవడంతో ప్రజలు కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారన్నారు ఈ విషయాన్ని జిల్లా అధికార యంత్రాంగంతో మేము మాట్లాడినప్పుడు ఒక నెలలో బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పడం జరిగింది. 18 నెలలు వేచి చూసిన మేము ఇంకో నెల వేచి చూస్తామని లేని పక్షాన జనసేన పార్టీ ఆధ్వర్యంలో దీక్షా కార్యక్రమం చేపట్టి ఉద్యమిస్తామని ఆ విధముగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు జనసేన పార్టీ ద్వారా న్యాయం చేసి అండగా ఉంటామని ఈ నెల రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే రేపటి రోజున మిమ్మల్ని ప్రజా తిరస్కరణ బాధితులుగా ఈ అధికార పార్టీ నాయకులను ఇండ్లకు సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని గుర్తుపెట్టుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం, నాగరాజు, పోలిశెట్టి శ్రీనివాసులు, హరికృష్ణ, గుగ్గిళ్ళ నాగార్జున, ఉగ్రం హేమంత్, మస్తాన్ రాయల్, కోండల గారి రవి, కోట్టే రాజేష్, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.