ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా 2023 నూతన సంవత్సర వేడుకలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పిఏసీ సభ్యులు నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ అందరికీ పంచారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ముందుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు జనసేనపార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్తసంవత్సరం ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నాలుగు మండలాల నుండి జనసేన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు హాజరై నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పితాని నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ చేసిన నినాదాలతో కార్యాలయం దద్దరిల్లింది ఇప్పటి నుంచే గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని రానున్న ఎన్నికల్లో పితాని బాలకృష్ణని శాసనసభ్యులుగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుద్దటి జమ్మి, గోదసి పుండరీష్, సానుబోయిన మల్లికార్జునరావు, జక్కంశెట్టి బాలకృష్ణ, మద్యంశెట్టి పురుషోత్తం, అత్తిలి బాబురావు, మోకా బాల ప్రసాద్, కడలి వెంకటేశ్వరరావు, ముత్యాల జయలక్ష్మి, గిడ్డి రత్నశ్రీ, నల్లా ఆండాల దేవి, ఓగూరు భాగ్యశ్రీ, రాయపురెడ్డి బాబి, దూడల స్వామినాయుడు, మట్టపర్తి శంకరం, పిల్లి గోపి, బీమాల సూర్య నాయుడు, పెమ్మాడి గంగాద్రి, పెమ్మాడి ఆదినారాయణ, అంగని నరసింహమూర్తి, పాలెపు ధనుంజయ, సంఘాని రవిశంకర్ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.