నూజివీడు: జనసేన క్యాలెండర్ ఆవిష్కరణ

నూజివీడు: నూజివీడు టౌన్ లో జనసేన పార్టీ క్యాలెండర్ ను పార్టీ నాయకులు ఆదివారం ఆవిష్కరించడం జరిగింది. నూతన సంవత్సరం వేడుకల్లో భాగంగా నూజివీడు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ రావాలి – పాలన మారాలి అనే నినాదంతో వేయించిన క్యాలెండర్ ను నూజివీడు నియోజవర్గం కాపు సంక్షేమ సేన, కాపు నాడు అధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన చేతుల మీదుగా ఆవిష్కరణ చేసి, నూతన సంవత్సర కేక్ కటింగ్ చేయడం జరిగింది.టౌన్, నాలుగు మండలాల్లో ఈ క్యాలెండర్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నూజివీడు మండలం అద్యక్షులు యర్రంశేట్టి రాము, వైస్ ప్రెసిడెంట్ ఇంటురి చంటి, ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్, ముసునూరు ప్రథాన కార్యదర్శి ప్రేమ చంద్, టౌన్ నాయకులు తాళం చెన్న, నాయుడు కిషోర్, విజయ శ్రీ, కొన్నంగుంట.రాంబాబు, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.