నూతన సంవత్సర క్యాలెండరు ఆవిష్కరించిన కిరణ్ రాయల్

తిరుపతి, ఆస్త్రేలియా జనసేన టీమ్ మెంబర్ గాజుల మురహరి నాయుడు జనసేన పార్టీ సిద్ధాంతాలు, షణ్ముఖ వ్యూహం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన సేవాకార్యక్రమాలను ప్రజలలోకి తీసుకెళ్ళేవిధంగా 2023 నూతన సంవత్సర క్యాలెండర్లను 3000 ప్రచురించి క్షేత్ర స్థాయిలో పంపిణి చేసే కార్యక్రమంలో భాగంగా తిరుపతి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ చేతుల మీదుగా క్యాలెండరు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.