రాజస్థాన్‌లో న్యూ ఇయర్ వేడుకలు రద్దు

న్యూ ఇయర్‌ వేడుకలకు రాజస్థాన్‌ ప్రభుత్వం రద్దు చేసింది. డిసెంబర్‌ 31న కర్ఫ్యూ విధించింది. రాత్రి 8గంటల నుంచి జనవరి ఉదయం ఒకటిన 6 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని అన్ని నగరాల్లో దాదాపు లక్షకుపైగా జనాభా ఉంది. ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. రాత్రి కర్ఫ్యూ విధించిన ప్రాంతాల్లో రాత్రి 7 గంటలకు మూసివేయాలని ఆదేశించింది. నూతన సంవత్సర సందర్భంగా అన్ని సమావేశాలు, బహిరంగ కార్యక్రమాలపై, పటాకులు కాల్చడంపై కూడా నిషేధం విధించింది. అలాగే ప్రార్థనా స్థలాల్లో కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.