విశ్వభారతి శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ

విశ్వభారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శాంతినికేతన్‌లో గల విశ్వ భారతి విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. విశ్వభారతి విశ్వవిద్యాలయం స్థాపనకు దారితీసిన పరిస్థితులను ఈ రోజు మనం మరోమారు మననం చేసుకోవాలన్నారు. ఇది మన గొప్ప ఆలోచనలు, వందల సంవత్సరాల ఉద్యమ చరిత్ర ఆధారంగా స్థాపించబడిందన్నారు.

గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గనిర్దేశనంలో విశ్వభారతి స్వాతంత్య్ర ఉద్యమంలో జాతీయవాద భావనకు బలమైన ఇమేజ్‌ను అందించిందన్నారు. భారతదేశ ఆధ్యాత్మిక మేల్కొలుపు నుండి మొత్తం మానవత్వం ప్రయోజనం పొందాలని గురుదేవ్ కోరుకున్నారన్నారు. ఆత్మనిర్బర్ భారత్ దృష్టి కూడా ఈ సెంటిమెంట్ నుంచే ఉత్పన్నమైనట్లు తెలిపారు. పారిస్ ఒప్పందం లక్ష్యాలను సాధించేందుకు సరైన దిశలో పయనిస్తున్న ఏకైక దేశం భారతదేశం అని ప్రధాని పేర్కొన్నారు.