ఏపీలో రేపట్నుంచి నైట్ కర్ఫ్యూ..

అమరావతి: కరోనా మహమ్మారి విజృంభణ దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ప్రకటించారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అందరికీ వ్యాక్సిన్ ఫ్రీ

మే 1వ తేదీ నుంచి 18 ఏండ్ల నుంచి 45 ఏండ్ల వయసున్న వారందరికీ కొవిడ్ టీకాను ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. అయితే 18 నుంచి 45 ఏండ్ల వయసున్న వారు 2,04,70,364 మంది ఉన్నట్లు గుర్తించారు. ఉచిత వ్యాక్సిన్ కోసం రూ. 1600 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.