ఇంద్రకీలాద్రి: రెండోరోజు.. బాలాత్రిపురసుందరీదేవి

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ దసరా నవరాత్రి ఉత్సవాలలో 10 రకాల అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మంత్రాలలో బాలా మంత్రం ఎంతో విశిష్టమైంది. చతుర్భుజాలు కలిగినటువంటి బాలా త్రిపుర సుందరి దేవికి ఒక చేతిలో పుస్తకం, జపమాల, వర,అభయమూలను ధరించి ఉంటుంది. బాలా త్రిపుర సుందరి అవతారం రోజున సువాసినులకు, బాలలకు పూజ చేయడం ఇంద్రకీలాద్రిపై ఆనవాయితీగా వస్తుంది.