‘గ‌మ‌నం’లో నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్

దర్శకురాలిగా సుజ‌నా రావు దర్సకత్వం వహిస్తున్న తొలి చిత్రం ‘గ‌మ‌నం’ తెలుగు, త‌మిళ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా ఫిల్మ్‌గా నిర్మాణ‌మ‌వుతోంది. రియ‌ల్ లైఫ్ డ్రామాగా ‘గ‌మ‌నం’ రూపొందుతోంది. గాయ‌ని శైల‌పుత్రీ దేవి అనే ప్ర‌త్యేక పాత్ర పోషిస్తోన్న నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను శుక్ర‌వారం హీరో శ‌ర్వానంద్ ఆవిష్క‌రించారు.

పోస్ట‌ర్‌లో శాస్త్రీయ గాయ‌నిగా ప‌ట్టుచీర ధ‌రించి ఒక క‌చేరీలో గానం చేస్తున్న నిత్యా మీన‌న్ ముఖంలో అంద‌మైన చిరున‌వ్వుతో పాటు ఒక దైవ‌త్వం కూడా గోచ‌రిస్తోంది. క‌థ‌లో నిత్య స్పెష‌ల్ అప్పీరెన్స్ ప్రాధాన్యం ఏమిట‌నేది ఆస‌క్తిక‌రం.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన శ్రియ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అందులో డీగ్లామ‌ర‌స్‌గా త‌క్కువ మేక‌ప్‌తో, సంప్ర‌దాయ వ‌స్త్ర ధార‌ణ‌తో క‌నిపించిన శ్రియ లుక్‌ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. మళ్ళీ ఇపుడు నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసి మ‌రోసారి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు నిర్మాత‌లు. ప్ర‌ముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్న ‘గ‌మ‌నం’ చిత్రానికి మేస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం స‌మ‌కూరుస్తున్నారు.