92 పోస్టుల భర్తీకి ఎస్‌బీఐ నోటిఫికేషన్

భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆశక్తి కలిగిన అభ్యర్థులు వచ్చేనెల 8 వరకు ఆన్‌లైన్‌లో (sbi.co.in) దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా అనుభవం ఆధారంగా, ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేయనున్నది.

మొత్తం పోస్టులు: 92

ఇందులో డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ)-28 పోస్టులు

 మేనేజర్(రిటైల్ ప్రొడక్ట్స్‌)-5                                                                                                                                                        

 డాటా ట్రెయినర్-1

 డాటా ట్రాన్స్‌లేటర్‌-1

 సీనియర్ కన్సల్టంట్ అనలిస్ట్‌-1

 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఎంటర్‌ప్రైజ్, టెక్నాలజీ ఆర్కిటెక్చర్‌)-1

 డాటా ప్రొటెక్షన్ ఆఫీసర్‌-1

 డిప్యూటీ మేనేజర్ (డాటా సైంటిస్ట్‌)-11

 మేనేజర్ (డాటా సైంటిస్ట్‌)11

 డెప్యూటీ మేనేజర్ (సిస్టమ్ ఆఫీసర్‌)-5

 రిస్క్ స్పెషలిస్ట్- 19

 పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్‌- 3

 పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌-5

అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి

వయస్సు: 25 నుంచి 55 ఏండ్లలోపు ఉండాలి

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 18

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 8

వెబ్‌సైట్‌: www.sbi.co.in లో పూర్తి వివరాలను చూడగలరు.