తీరం దాటిన నివర్‌ తుఫాను.. భారీగా ఆస్తినష్టం

నివర్‌ తుఫాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. నిన్న రాత్రి తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో పుదుచ్చేరిలో తుఫాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను తీరం దాటే సమయంలో 120 నుంచి 145 కిలోమీటర్ల వేగంతో గాలులువీచాయి. దీంతోపాటు వరణుడు కుంభవృష్టి కురింపించాడు. తుఫాను తీరందాటిన తర్వాత అతి తీవ్ర తుఫాను నుంచి తుఫానుగా మారిందని ఐఎండీ తెలిపింది. నివర్‌ ప్రభావంతో పుదుచ్చేరితోపాటు, తమిళనాడులోని చెన్నై సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

తుఫాన్ తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలిల కారణంగా భారీ వృక్షాలు నెలకొరిగాయి. పంటలు/ తోటలకు నష్టం వాటిల్లింది. తీర ప్రాంతాల్లో ఉన్న జనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఆస్తినష్టం మాత్రం ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.