జనసేనానిని కలిసిన రెడ్డయ్య యాదవ్‌.. షాక్‌లో వైసీపీ

రెండు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్  నివర్ తుపాన్ బాధిత రైతుల్ని పరామర్శించేందుకు జిల్లాల పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. రైతులను కలుస్తూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు పవన్. ఈ క్రమంలో పామర్రు వద్ద పవన్‌ను మాజీ ఎంపీ కె.పి.రెడ్డయ్య యాదవ్ కలిశారు. ప్రభుత్వం రైతుల్ని పట్టించుకోవడం లేదని, తుఫాన్‌ పరిహారం తదితర విషయాలను ఆయనకు వివరించారు. పవన్ కూడా.. రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకుందామని మాటిచ్చారు. ఈ సంఘటన  వైసీపీ శ్రేణులకు కొద్ది పాటి షాక్ కు గురిచేసింది ఎందుకంటే..?

మాజీ ఎంపీ రెడ్డయ్య యాదవ్ ఎవరంటే.. వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పార్థసారధికి తండ్రి. రెడ్డయ్య వారసుడిగానే పార్థసారధి రాజకీయాల్లోకి వచ్చారు. ఇన్నాళ్లు పెద్దగా యాక్టివ్ గా లేని రెడ్డయ్య కొడుకు ఉన్న పార్టీ ప్రత్యర్థిని కలవడం చర్చనీయాంశం అయ్యింది. ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. దీంతో వైసీపీ క్యాడర్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

అయితే  ఇటీవల పార్థసారధికి తన సీనియార్టీని గుర్తించడం లేదని వైసీపీపై అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరుగున్న నేపథ్యంలో.. ఆయన తండ్రి పవన్‌ను కలవడం మరింత చర్చినీయాంశమైంది.