గాదె వెంకటేశ్వరరావును సన్మానించిన నూజివీడు జనసేన

గుంటూరు జిల్లా, ప్రముఖ హైకోర్టు న్యాయవాది గాదె వెంకటేశ్వరరావు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నూజివీడు జనసేన శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించడం జరిగింది. భవిష్యత్తులో గుంటూరు జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేన పార్టీ నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం నాయకులు హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మరిదు శివరామకృష్ణ , జనసేన నూజివీడు పట్టణ నాయకులు ముత్యాల కామేష్, వెంకటాయ పాలెం గ్రామ జనసైనికుడు ఇంటూరి చంటి,
హెల్పింగ్ హ్యాండ్స్ సభ్యులు దొండపర్తి ఆకాశ్ తదితరులు పాల్గొన్నారు.