అత్యంత భారీ వర్షంలో మహిళ ప్రాణాలు కాపాడిన జనసేన

భైంసా, రక్త హీనత తో గత రెండు రోజులుగా, రక్త కణాలు పూర్తి స్థాయిలో పడిపోయాయి అలా బాధపడుతున్న మహిళ జనసేన పార్టీ నాయకులను సంప్రదించడం జరిగింది. సోమవారం రాత్రి నుండి జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు స్పందించి వెంటనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారం పంపడంతో కొన్ని నిమిషాల్లోనే రక్త దాతలు స్పందించి రక్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వెంటనే మంగళవారం రక్త దాతను వెంట పెట్టుకొని భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భైంసా నుండి నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ వెళ్లి ఎబి పాజిటివ్ రక్త కణాలను తీసుకొచ్చి ఆ మహిళకు రక్తాన్ని ఎక్కించడం జరిగింది. ఈ సందర్భంలో సహకరించిన రక్త దాత సిబ్బుల రాజు (లక్ష్మన్) అదేవిధంగా హమారా సహారా యూత్ సభ్యులు వాడేకర్ లక్ష్మన్, జనసేన నాయకులు, నారాయణ్, కునాల్, కుటుంబ సభ్యులు శ్రీనివాస్, కిషన్ లకు ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసిన జనసేన పార్టీ. ప్రజలు సమస్యల్లో వుంటే జనసేన పార్టీ అండగా నిలిచి ప్రాణాలను కాపాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి సమస్యల్లో ఉన్న ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తున్నామని తెలిపారు.