జనసేన పార్టీ నుంచి ఒక్కపిచ్చుక కూడా వైసీపీలో చేరలేదు

రైల్వేకోడూరు, అనంతరాజు పేటలో జనసేన నుంచి వైసీపీలో చేరిక అని పేపర్ లో ప్రకటనలు ఇచ్చుకున్న వాళ్ళు దమ్ముంటే నిరూపించాలని సీనియర్ జనసేన నాయకులు ముద్దపోలు రామసుబ్బయ విమర్శించారు. వాళ్లకు వాళ్ళే వాళ్ళ కండువాలు కప్పుకుని ఆపార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అని చెప్పుకోవడం హాస్యాస్పదమని, అయినా ఈ నాలుగు సంవత్సరాలలో ఏమి చేశారని మీ పార్టీలో చేరతారని నిలదీశారు. ఇంకొద్దిరోజుల్లో మీ పార్టీ భజన పరులతో సహా ఖాళీ కావడం తథ్యమని చెప్పారు. ఇలాంటి అవాస్తవ ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారని, చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయమని తెలిపారు.