రైల్వేలో 80 మెడికల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ పరిధిలోని మెడికల్‌ విభాగంలో తాత్కాలిక పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడింది. 7 క్యాటగిరీల్లో మొత్తం 80 పోస్టులకు ఈ నోటిఫికేషన్‌ జారీచేశారు.

మొత్తం పోస్టులు: 80

డాక్టర్‌ : 3

జీడీఎంవో:16

 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌: 31

 హాస్పిటల్‌ అటెండెంట్‌: 26

ఫార్మసిస్టు: 2

హెల్త్‌ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్‌: 1

ల్యాబ్ అసిస్టెంట్‌: 1 పోస్టులున్నాయి.

ఈ ఉద్యోగాల్లో చేరదల్చుకున్నవారు ఈ నెల 29 లోగా contractmedicalhyd @gmail.com పోర్టల్‌కు పంపాలని, పూర్తి వివరాల కోసం SCR వెబ్‌సైట్‌ను సందర్శించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.