సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్‌లో 1565 అప్రెంటిస్‌లు పోస్టుల భర్తీకి కోసం నోటిఫికేషన్

సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్‌)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి కోసం నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తికలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అక్టోబర్ 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 1565

ఇందులో ఎలక్ట్రిషన్‌-630, ఫిట్టర్‌-425, మెకానిక్‌-175, వెల్డర్‌-80, కోపా-50, మెషినిస్ట్‌-50, టర్నర్‌-50, సెక్రటేరియట్ అసిస్టెంట్‌-50, ఎమ్మెల్టీ-30, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటేనెన్స్‌-25 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

అర్హతలు: పదో తరగతి తప్పనిసరిగా ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. సిస్టమ్ మెయింటేనెన్స్ పోస్టుకు ఐటీఐలో ఐటీ లేదా ఐటీసీటీఎస్ఎం లేదా ఐటీఈఎస్ ట్రేడ్ చేసి ఉండాలి. అదేవిధంగా 18 నుంచి 30 ఏండ్లలోపువారై ఉండాలి.

ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 5

వెబ్‌సైట్‌: centralcoalfields.in లో పూర్తి వివరాలను చూడవచ్చు