ONGC సంస్థలో ఉద్యోగాల నోటిఫికేషన్

ONGC కి చెందిన సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ONGC మంగళూరు పెట్రోకెమికల్స్ లిమిటెడ్-OMPL గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటీస్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 25 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు https://https://www.ompl.co.in/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. దరఖాస్తు చేసే ముందు నోటిఫికేషన్‌ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే omplhr@omplindia.com మెయిల్ ఐడీకి మెయిల్ చేయాలి.

ఖాళీల వివరాలు…

మొత్తం ఖాళీలు- 25

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 1

విద్యార్హతలు- గ్రాడ్యుయేట్ అప్రెంటీసీ పోస్టుకు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా పాస్ కావాలి. 2018, 2019, 2020 లో క్వాలిఫయింగ్ ఎగ్జామ్ పాస్ కావాలి.

స్టైపెండ్- రూ.8000

ఎంపిక విధానం- మార్కుల ఆధారంగా దరఖాస్తులు షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ప్రకారం ఎంపిక చేస్తారు.

అభ్యర్థులు https://www.ompl.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Engagement of Apprentice లింక్ పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత Registration Form పైన క్లిక్ చేయాలి.

మీ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, అడ్రస్, ఇతర వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.

ఫోటో, సంతకం అప్‌లోడ్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.