కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ‘RRR’ టీజర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు యస్ యస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం సీనిమాలోంచి ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వీడియో టీజర్ ను 11.30గం.లకు విడుదల చేశారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో తమ అభిమాన కథానాయకుడు ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ కోసం ఆశగా చూస్తున్న ఎన్టీఆర్‌ అభిమానులకు చిత్ర బృందం అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చింది. లేటుగా వచ్చిన లేటెస్ట్‌గా కొమరం భీమ్‌ ఎన్టీఆర్‌ పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆలియాభట్‌, ఓలివియా మోరిస్‌ కథానాయికలు. ఈ ఏడాది వేసవిలో ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ అంటూ అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌ పాత్రను పరిచయం చేసిన చిత్ర బృందం ఇప్పుడు కొమరం భీమ్‌ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్‌ ఇటీవల ప్రారంభం కాగా, షూటింగ్‌ మొదలైన వెంటనే ఎన్టీఆర్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించి, ప్రత్యేక వీడియోను విడుదల చేస్తామని దర్శకుడు రాజమౌళి ప్రకటించారు. గురువారం తాజా వీడియోను రామ్‌చరణ్‌ అభిమానులతో పంచుకున్నారు. ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని తొలుత చెప్పినా, అభిమానులను కాస్త ఊరించి 11.30గం.లకు విడుదల చేశారు.