జానీ మాస్టర్ హీరోగా ఓషో తులసీరామ్ చిత్రం

డ్యాన్స్ మాస్టర్లు హీరోలుగా మారడం.. సక్సెస్ అవడం ఎప్పటినుంచో మనం చూస్తూనే వున్నాం. ప్రభుదేవా, లారెన్స్, అమ్మ రాజశేఖర్..  వంటి కొరియోగ్రాఫర్లు హీరోలుగా మారి పలు సినిమాలలో నటిస్తూ తమదైన ముద్ర వేస్తున్నారు. ఇదే కోవలో హీరోగా మారిన మరో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్! ఇటీవలే ఆయన కథానాయకుడుగా ఓ సినిమా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన మరో సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడు

గతంలో ‘మంత్ర’, ‘మంగళ’ వంటి చిత్రాలతో పేరుతెచ్చుకున్న దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్నాడు. నేడు జానీ మాస్టర్ జన్మదినాన్ని పురస్కరించుకుని దీనికి సంబంధించిన ప్రకటనను నిన్న విడుదల చేశారు.

ఈ చిత్రం పేరు ‘దక్షిణ’. జానీ మాస్టర్ బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించడం ఆనందంగా ఉందని దర్శకుడు ఓషో తులసీరామ్ అన్నారు. దీనిని సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నామని ఆయన చెప్పారు. గోవా, అరకు, బెంగళూరు ప్రాంతాలలో షూటింగ్ చేస్తామని తెలిపారు.