వైస్సార్సీపీ అంటే వైస్సార్ కరప్షన్ పార్టీ అని మరోసారి నిరూపించిన ఆంజనేయరెడ్డి

  • కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి చెయ్యని అవినీతి లేదు
  • ఆంజనేయరెడ్డి చేస్తున్న అక్రమ వ్యాపారాలపై అధికారులు స్పందించాలి
  • 40వ డివిజన్ క్రియాశీలక సభ్యత్వ నమోదు సమన్వయకర్త మరియు న్యాయవాది ఎం. హనుమాన్

విజయవాడ వెస్ట్: 40వ డివిజన్ కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి పెద్దమనిషి ముసుగులో చేస్తున్న అవినీతి అనకొండను మించిపోయిందని, ఆంజనేయ రెడ్డి చెయ్యని అవినీతి లేదని జనసేన 40వ డివిజన్ క్రియాశీలక సభ్యత్వ నమోదు సమన్వయకర్త మరియు న్యాయవాది ఎం. హనుమాన్ పేర్కొన్నారు. అనుమతులు లేకుండా స్కూల్స్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వాన్ని మరియు సమాజంలో మధ్యతరగతి తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తున్నారు. డివిజన్లో అక్రమ నిర్మాణాలు చేయిస్తూ అడ్డదిడ్డంగా లక్షల రూపాయలు సంపాదించడంలో ఆంజనేయరెడ్డిది అందెవేసిన చేయి. విఎంసి పార్కింగ్ కాంట్రాక్టు తీసుకుని డబ్బులు సరైన రీతిలో చెల్లించకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకొని మినహాయింపులు పొందుతూ.. నగర అభివృద్ధికి గండి కొడుతూ.. లక్షల రూపాయలు వెనకేసుకోవడంలో అందెవేసిన చేయి ఆంజనేయ రెడ్డిది. ఆయన చేస్తున్న అక్రమ వ్యాపారాలపై స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విజయవాడ మున్సిపల్ కమిషనర్, విద్యాశాఖ అధికారులు స్పందించాలి. అనుమతి లేకుండా తెరిచిన స్కూలు తక్షణమే మూసివేయాలి. అనుమతి లేకుండా డివిజన్ లో చేసిన అక్రమ నిర్మాణాలను కార్పొరేషన్ అధికారులు తక్షణమే తొలగించాలి. వైయస్సార్ సిపి పార్టీలో ఒక కార్పొరేట్ అభ్యర్థి కొన్ని కోట్లు అవినీతి చేస్తుంటే.. ఎమ్మెల్యే స్థాయి, మినిస్టర్ స్థాయి ఇంకెన్ని వేల కోట్లు అవినీతి చేశారో కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది. వైఎస్ఆర్సిపి నాయకులు అభివృద్ధి చేశామని మాటలు చెప్పడం వాళ్ల దృష్టిలో అభివృద్ధి అంటే అక్రమ కట్టడాలు, ఫామ్ హౌసులు వాళ్ల అవినీతి చేసి అక్రమ కట్టడాలు కడితే అది రాష్ట్ర అభివృద్ధి అని వాళ్లు భ్రమ పడుతున్నారు. వైయస్సార్ సిపి పార్టీ అంటే వైయస్సార్ కరప్షన్ పార్టీ అని, దానికి నిదర్శనమే ఆ పార్టీలో జరిగే అవినీతి కార్పొరేటర్ స్థాయి నుంచి మినిస్టర్ స్థాయి వరకూ కొన్ని కోట్లు అవినీతి జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు సరైన రీతిలో మీకు బుద్ధి చెప్తారని ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి పరిపాలన కోరుకుంటున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి పరాకాష్టగా మారింది. ఆయన అవినీతిని బయటపెట్టి ప్రజా సమస్యలపై నిత్యం స్పందిస్తూ ప్రజల కోసం పోరాడుతున్న పోతిన మహేష్ గారిని ఈసారి పశ్చిమ నియోజకవర్గం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపుతారు. పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని ఎం. హనుమాన్ తెలిపారు.