సూర్య విలేకరి ఆదిమూలం గంగాధర్ ను పరామర్శించిన డాక్టర్ మాకినీడి వీరప్రసాద్

యు కొత్తపల్లి: ఉప్పాడ కొత్తపల్లి మండల సూర్య రిపోర్టర్ ఆదిమూల గంగాధర్ ఆయన స్నేహితుడు కల్కికి శనివారం తెల్లవారుజామున బిచ్ రోడ్లో జరిగిన బైక్ యాక్సిడెంట్ లో సూర్య విలేకరి ఆదిమూలం గంగాధరరావుకు తలకి బలమైన గాయమైనది. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజవర్గం జనసేన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి, వారి బర్త డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ మరియు యు కొత్తపల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పట్టా శివ ఆదిమూలం గంగాధర్ ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. గంగాధర్ రావు స్నేహితుడు కల్కికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి.