okyo Olympics: ఫెన్సింగ్‌లో భవానీ దేవి ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌ నాలుగో రోజు భారత్‌ శుభారంభం పలికింది. ఫెన్సింగ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో భారత ఫెన్సర్‌ భవానీ దేవి ఘన విజయం సాధించింది. టునీషియాకు చెందిన నాజియా బెన్‌ అజిజ్‌పై 15-3 పాయింట్ల తేడాతో విన్‌ అయ్యింది. మ్యాచ్‌ ప్రారంభమైన 6 నిమిషాల్లోనే భవానీ దేవి గెలుపును సొంతం చేసుకుంది.

టోక్యో ఒలింపిక్స్‌లో మూడో రోజైన ఆదివారం భారత అథ్లెట్లు మిశ్రమ ఫలితాలను అందించారు. బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు తన తొలి మ్యాచ్‌లో విజయం సాధించగా, బాక్సర్‌ మేరీ కోమ్ ప్రి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లింది. టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ప్లేయర్‌ మనికా బాత్రా మహిళ సింగిల్స్‌లో అద్భుత విజయం సాధించింది. ప్రపంచ 32వ ర్యాంకర్‌ మార్గరిటా పెసోట్‌స్కోతో జరిగిన రెండో రౌండ్‌లో తుదివరకు పోరాడి గెలుపును సొంతం చేసుకుంది. ఇక షూటింగ్‌తో పాటు స్విమ్మింగ్‌లో భారత క్రీడాకారులు నిరాశ పర్చారు. నాలుగో రోజైన సోమవారం భారత ఆటగాళ్లు మొత్తం 10 విభాగాల్లో పోటీ పడనున్నారు.