మాజీ మంత్రి వివేకా హత్య కేసు.. సీబీఐ కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ

ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ ఇటీవల వేగం పెంచింది. అనుమానితులను వరుసగా విచారిస్తూ కీలక విషయాలు  రాబడుతోంది. ఇటీవల వివేకా ఇంటి వాచ్‌మన్ రంగన్నను కూడా విచారించారు. ఈ సందర్భంగా ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.

ఇక విచారణలో రంగన్న పలు కీలక విషయాలు వెల్లడించినట్టు వార్తలు బయటకొచ్చాయి. ఇప్పటి వరకు ఈ దర్యాప్తు మొత్తం ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో జరిగింది. ఇటీవల ఆమె ఢిల్లీ వెళ్లిపోగా తాజాగా ఆమె స్థానంలో ఎస్పీ స్థాయి అధికారి ఒకరు నిన్న ఢిల్లీ నుంచి కడప చేరుకుని బాధ్యతలు చేపట్టారు. రెండు రోజులుగా అనుమానితులను ఎవరినీ సీబీఐ విచారణకు పిలవలేదు.