డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయసారథి పవన్ కళ్యాణ్ మాత్రమే.. బత్తుల

  • జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర 63వ రోజు
  • దోసకాయలపల్లి ఎస్సీ పేట నుండి 100 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరిక…
  • జనం కోసం జనసేన.. మహాపాదయాత్ర కు అపూర్వ ఆదరణ..
  • వైసిపి అరాచక పాలనపై యువత గళమెత్తాలి.. కలిసి పోరాడుదాం రండి. సమావేశంలో బత్తుల పిలుపు..

రాజానగరం, సీతానగరం మండలం, దోసకాయలపల్లి ఎస్సీ పేటలో జరిగిన మహాపాదయాత్ర 63వ రోజు కార్యక్రమానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. కార్యక్రమంలో భాగంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి లకు పూలవర్షం కురిపిస్తూ, తీన్మార్ డప్పులతో.. బాణాసంచా కాల్చుతూ, మహిళలు హారతులు పడుతూ.. దోసకాయలపల్లి గ్రామ జనశ్రేణుల నుండి అపూర్వ స్వాగతం లభించింది.. గ్రామంలో ముందుగా భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి మరియు భారత ఉపప్రధాని, సంఘసంస్కర్త బాబు జగజ్జివన్ రామ్ గార్ల విగ్రహాలకు పూలమాలలు అర్పించి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.. అనంతరం జరిగిన సమావేశంలో వైయస్సార్సీపీకి చెందిన 100 మంది కార్యకర్తలు జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి మరియు వైసీపీ అరాచక పాలనకు విసుగుచెంది జనసేన పార్టీలో చేరారు, వారందరినీ జనసేన కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.. అనంతరం బత్తుల బలరామకృష్ణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటే అవి చూసి ఓర్వలేక కొంతమంది వైసీపీ యువనాయకులు ఏదేదో మాట్లాడుతున్నారని.. వారికిలా నియోజకవర్గంలో ఉన్న చెరువులు, కొండలు, గుట్టలు, ఇసుక లాంటి సహజ వనరులను తినేసి అవినీతి సొమ్మును కుప్పలు కుప్పలుగా పోగు చేసుకోలేదని, అసలు వారికి నన్ను అనే నైతిక హక్కు లేదని చెబుతూ.. మీలో ఎవరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే నన్ను సంప్రదించాలని, ఈ వైసీపీ అరాచక పాలనపై ప్రతి ఒక్కరూ నడుం బిగించి జనసేన పార్టీ వచ్చే వరకు అవిశ్రాంతంగా పోరాడాలని పిలుపునిచ్చారు, అంబేద్కర్ గారు, జగజ్జివన్ రావు గారు లాంటి మహనీయుల ఆశయాలు నెరవేరాలంటే అది ఒక పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరుడు వల్లనే సాధ్యమవుతుందని తెలుపుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం అందరూ మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు.. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ సెక్రెటరీ శివరాం, బొడ్డపాటి నాగేశ్వరరావు, స్టాలిన్, యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డి వేణు, అడ్డాల శ్రీను, కొల్లి రమేష్ తదితర సీనియర్ నాయకులుతో పాటు అనేకమంది జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.