గర్భాం గ్రామంలో జనసేన కార్యాలయ ప్రారంభం

చీపురుపల్లి నియోజకవర్గం, మెరకముడిదాం మండలం, గర్భాం గ్రామంలో మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి & నాయుడు ఆధ్వర్యంలో బుధవారం జనసేన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అద్యక్షలు రౌతు కృష్ణవేణి, మాట్లాడుతూ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలును ప్రజల్లోకి మరింత చేరువయ్యాల పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, నాలుగు మండలాల అధ్యక్షలు పెద్ది వెంకటేష్, విజినిగిరి శ్రీనివాసరావు, గుర్ల సంతోష్, జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ తుమ్ము లక్ష్మీ రాజ్, తుమ్మిగంటి సూరి నాయుడు, ఆదాడ మోహన్, గుర్ల దంతులూరి రమేష్ రాజు, మరియు చీపురుపల్లి నియోజకవర్గ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుతెలిపారు.