పిడికిటిమాల మరియు అనకవోలు గ్రామాల్లో “మన ఇల్లు – మన జనసేన”

సూళ్లూరుపేట నియోజకవర్గం, పెళ్లకూరు మండలం, కలవకూరు పంచాయితీలోని పిడికిటిమాల మరియు అనకవోలు గ్రామాల్లో మన ఇల్లు – మన జనసేన కార్యక్రమాన్ని సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 260 పైగా కుటుంబాలను కలుస్తూ.. స్థానిక సమస్యలు ప్రజలను నేరుగా అడగగా పిడికిటిమాలలో ఇళ్ళు లేని వారు ఇళ్లు త్వరగా కట్టించాలని, అలానే నీళ్ళ ట్యాంకు నిర్మించమని గ్రామస్థులు తెలియజేశారు. అదేవిధంగా కలవకూరులో ప్రజలు సీసీ రోడ్లు, వీధి లైట్లు, రాముల వారి గుడి నిర్మాణం లాంటి సమస్యలను జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు. ఖచ్చితంగా అధికారులతో పరిష్కార దిశగా చర్చిస్తామని తెలిజేయయడం జరిగింది. అలానే పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024లో జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పండు, సాయి, శ్రీను, కిరణ్, సునీల్, వంశీ, మౌళి, రాఘవేంద్ర మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు. అలానే పెళ్లకూరు మండల ఎంపిడిఓ గారికి సోమశేఖర్ ఫోన్ చేసి గుర్రపుతోట నుంచి పాలచూరు వెళ్ళే రోడ్డు నిర్మించాలని 10 ఏళ్లుగా రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని ఈ సమస్యను ప్రధానంగా వెంటనే పరిష్కరించాలని అధికారిని కోరారు. స్పందించి వివరాలు పరిశీలిస్తామన్న ఎంపిడిఓ గారికి ధన్యవాదాలు తెలియజేశారు.