తనయాలి గ్రామ పంచాయితీలో మన ఇళ్ళు – మన జనసేన

సూళ్లూరుపేట నియోజకవర్గం, దొరవారి సత్రం మండలం, తనయాలి గ్రామ పంచాయితీలో సుమారు 210 పైగా కుటుంబాలను జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ నాయకత్వంలో స్థానిక జనసైనికుల ఆధ్వర్యంలో మన ఇళ్ళు – మన జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి కుటుంబాన్ని కలుస్తూ, స్థానిక సమస్యలన్నీ ప్రజలను నేరుగా అడిగి తెలుసుకుంటూ పాలనలో మార్పు తీసుకురావాలి అన్న కోణంలో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి 2024లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్_కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయవలసిందిగా ప్రజలను కోరడం జరిగింది. అలానే స్థానిక సీసీ రోడ్లు వంటి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చర్చిస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తడ మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పులి దిలీప్ మరియు స్థానిక పంచాయితీ జనసైనికులు పాండు, శేషగిరి, శివ, మోహన్, బాలాజీ, గురవయ్య, వెంకటేష్, మని, కార్తిక్, జనుభాయ్ తదితరులు పాల్గొన్నారు.