జనసేన ఆధ్వర్యంలో మా ప్రాంతం మన సచివాలయం

కాకినాడ, స్దానిక 16 వార్డు సచివాలయం ప్రాంతంలో జనసేన పార్టీ నాయకులు సంగాడి బుజ్జి ఆధ్వర్యంలో మా ప్రాంతం మన సచివాలయం కార్యక్రమంలో జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ మరియు పి.ఏ.సి సభ్యులు ముత్తా శశిధర్ పాల్గొని స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు మాట్లాడుతూ ముఖ్యంగా కరెంట్ బిల్లు, చెత్త పన్ను చెల్లింపులు భారంగా మారాయని బాధితులు పేర్కొన్నారు. జ్వరాలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నామని చెప్పుకొచ్చారు. ముత్తా శశిథర్ వద్ద మొర పెట్టుకున్న బాధితుల ఆవేదనపై ఆయన స్పందిస్తూ జగన్ పాలన మోసాల పుట్ట అని వైకాపా ప్రభుత్వం దిశానిర్దేశం లేకుండా పాలన సాగిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను రావచ్చని ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంటే అందుకు కావాలిసిన ముందు జాగ్రత్తలు తీసుకోని వింత ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. వైరల్ జ్వరాలు ప్రబలకుండా తగిన చర్యలు చేపట్టాలని వై.సి.పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. జగన్ మాట నమ్మి మోసపోయామని అందుకు ఫలితంగా ఇన్ని రకాల అనర్ధాలు వెంటాడుతున్నాయి అని ప్రజలు వాపోతున్నారని, చేతులు కాలాకా ఆకులు పెట్టుకునే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు వారివెంట జన సేన పార్టీ అండగా ఉంటునదని బరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు విజయ్ కుమార్, మూలసాని చక్రం, రాజు, అజయ్, వీరమహిళలు పాలపు గంగ, జగదాంబ, నూకారత్నం తదితరులు పాల్గొన్నారు.