పలు కుటుంబాలకు అండగా డాక్టర్ పిల్లా శ్రీధర్

  • అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామం నందు బొందు లోవయ్య ఇల్లు భారీ అగ్ని ప్రమాదం కారణంగా భారీగా ఆస్తి నష్టంతో పాటు ఏ ఆధారం లేక కట్టుబట్టలతో కుటుంబంతోపాటు రోడ్డున పడిన వైనం. విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ అవసరాల నిమిత్తం ఒక నెలకు సరిపడా 50 కేజీల బియ్యం మరియు కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపనదొర, బొందు బుజ్జి, కావూరు పెద్దాపురం, బొందు నాగేష్, బొందు దేవుడు, బొందు దేవుళ్ళు, బొందు సత్తిబాబు, పల్నాటి మధుబాబు, కర్రీ రాము, పుక్కల్లా కుమార్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.

  • మైలపల్లి రాజుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, ఉప్పాడ కొత్తపల్లి మండలం, ఉప్పాడ గ్రామం మాయాపట్నం నందు మన జనసైనికుడు డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైనమిక్ కార్యకర్త అయినటువంటి మైలపల్లి రాజు మూడు రోజుల కిందట బైక్ ఆక్సిడెంట్ కారణంగా గాయాలపాలవడం జరిగింది. ఇంట్లో ఉంటూ ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి మైలపల్లి రాజుని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగిన జాగ్రత్తలు సలహాలను అందించడం జరిగింది. అనంతరం వారి యొక్క కుటుంబ అవసరాల నిమిత్తం కొంతమేర ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్న దొరగారు, మత్స్యకార నాయకులు వంక కొండబాబు, చింతకాయల పూరి జగన్నాథం, తిత్తి యల్లారి, బొంతల వెంకట్రావు, బడే మాసేను, ఉమ్మిడి మాసేను, మడద సింహాద్రి, పల్నాటి మధుబాబు, కోన రాము మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.