మా ప్రాంతం.. మా సచివాలయం.. మన జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముత్తా

కాకినాడ సిటిలో మా ప్రాంతం – మా సచివాలయం – మన జనసేన అనే నినాదంతో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా ముత్తా శశిథర్ ఆధ్వర్యంలో, మాజీ కార్పోరేటర్ ర్యాలి రాంబాబు నాయకత్వంలో సచివాలయం పరిధి 45 ఏ సచివాలయ పరిధిలో మరియు వీరమహిళ శ్రీమతి బోడపాటి మరియా నాయకత్వంలో 24 ఏ సచివాలయ పరిధిలోనూ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 45 ఏ సచివాలయ పరిధిలో ప్రజల సమస్యలు విన్న ముత్తా శశిధర్ స్పందిస్తూ ఎన్నో ఏండ్లనుండీ పేద ప్రజలకు ఆలంబనగా ప్రభుత్వాలు ఎప్పటినుండో అమలు చేస్తున్న పెన్షన్ పధకం మొత్తం పెంచుతున్నామని గొప్పలు చెప్పుకుంటూ అర్హులను ఏరివేస్తూ చర్యలు చేపట్టడం చూస్తుంటే కొండ నాలికకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయింది అన్నట్టుగా చేస్తున్నారన్నారు. అదేవిధంగా 24 ఏ సచివాలయ పరిధిలో సమస్యలు విన్న ముత్తా శశిధర్ తాగునీరు ప్రజలకు అందించడం స్థానిక సంస్థల ద్వారా ప్రభుత్వాల బాధ్యత అనీ దీనినుండీ తప్పించుకోజాలరని, కరెంటు బిల్లు బాధితురాలు మాసపల్లి అంజమ్మ సమస్య విని స్పందిస్తూ కరెంటు చార్జీలు పేదల నడ్డి విరుస్తున్నాయనీ వాటిపై కూడ వ్యాపార దృక్పధంతో వ్యవహరించడం ప్రభుత్వ తప్పిదమని ఆక్షేపించారు. ప్రజల సమస్యలపై జనసేన పార్టీ తరపున పోరాడతామని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో 45 ఏ సచివాలయ పరిధిలో ర్యాలి నాగేస్వరరావు, ముమ్మిడి రాంబాబు, కాశిలంక అబ్బు, తోట నారాయనరావు, భగవాన్, నరసిమ్హకుమార్, అప్పారావు పాల్గొనగా, 24 ఏ సచివాలయ పరిధిలో మడ్డు విజయ్ కుమార్, బట్టు లీల, శ్రావణి, నందిని, ఏ. లక్ష్మి, మారమ్మ, శాంతమ్మ, కుమారి, పి.అరుణ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.