పెద్దనెమలిపురి గ్రామంలో మన ఊరు మన ఆట

రాజుపాలెం మండలం, పెద్దనెమలిపురి గ్రామంలో జనసేన అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మన ఊరు – మన ఆట సంక్రాంతి సంబరాల్లో భాగంగా వీరమహిళలకు ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసిన పెద్ద నెమలిపురి గ్రామ జనసైనికులు, వీరమహిళలు. ముగ్గుల పోటీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, శివ పార్వతి, రాజుపాలెం మండలం అధ్యక్షులు తోట నరసయ్య పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు.