చెవిలో పువ్వు పెట్టి బిసిలను పరేషాన్ చేసిన కేసీఆర్

  • బిసి కుల వృత్తుల ఆధ్వర్యంలో బిసిల నిరసన దీక్ష

భైంసా: భైంసా పట్టణంలోని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బిసి కుల వృత్తుల ఆధ్వర్యంలో బిసిల నిరసన దీక్ష చేయడం జరిగింది. ఈ సందర్భంగా బిసి సంఘాల పరిరక్షణ సమితి రాష్ట్ర కో కన్వీనర్ సుంకెట పోశెట్టి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన బిసి కుల వృత్తి దారులకు ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఇవ్వాలనీ, బిసి కుల జనగణ చేయాలని, బిసి జనాభా దామాషా ప్రకారం చట్ట సబల్లో రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన దీక్ష చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం బిసిల చెవిలో పువ్వు పెట్టి నమ్మించి మోసం చేస్తుంది. ప్రకటించిన లక్ష రూపాయలు జిల్లా కేంద్రంలో కొందరికి మాత్రమే ఇచ్చారు. కాని దరఖాస్తు పెట్టిన అందరికీ ఇవ్వడం లేదు. ఎందుకు అనగా రాష్ట్రంలో వున్న ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అనుకూలంగా వున్న వారికి మాత్రమే లోలోపల ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మిగితా వారికి ఇచ్చే అవకాశలు కనపడటం లేదు. అదేవిధంగా ఈ పథకాన్ని మొత్తం బిసి లందరికీ వర్తింప చేయాలని డిమాండ్ చేస్తున్నాం. బిసి లంటే చులకనగా చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. లేని యెడల భవిష్యత్ లో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నమని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మద్దతుగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు, విశ్వ కర్మ సంఘం నాయకులు గంగాప్రసాద్, పవన్, విక్రమ్, బిసి సంఘం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాండ్ల శ్రీనివాస్, సాయి రాజ్, పెద్ద శ్రీను, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, బెంబర్ సాయినాథ్, రాములు, రజక సంఘం నాయకులు, రాములు, మహేష్, సురేష్, హన్మండ్లు, ఆనందిత ఫౌండర్ వడేకర్, లక్ష్మన్, ఎస్సీ సంఘం నాయకులు సాహెబ్ రావ్, సంపంగి ప్రభాకర్ జిల్లా అధ్యక్షులు వడ్డెర సంగం, బెజ్జంకి.రవి స్వర్ణ కార సంగం జిల్లా నాయకులు, పి. కిస్ట య్య, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు, బి. సాయినాథ్, మేర సంఘం నాయకులు, బద్రి, సాయి నాథ్, సేటన్న, బీసీ మహిళ నాయకులు, లక్ష్మి బాయి, క్రిష్ణ వేని, సురేష్, మహేశ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంజద్, బి.ఎస్.పి పార్టీ రవి, దేవిదాస్, అశోక్, మిగితా కులాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.